అమెరికా నేవీ అధికారులకు ఇరాన్ తాజా హెచ్చరిక
మినాబ్ పాఠశాలపై దాడికి బాధ్యులుగా ఇద్దరి గుర్తింపు
టెహ్రాన్ : మినాబ్ నగరంలోని ఓ ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడికి బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు అమెరికా నౌకాదళ అధికారులకు ఇరాన్ తాజాగా బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ నెల 13న సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఆ అధికారుల ఫొటోలను షేర్ చేస్తూ 'మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం' అని హెచ్చరించింది. ఇరాన్ రాయబార కార్యాలయం గుర్తించిన ఆ అధికారులు అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ స్ప్రూయన్స్‌కు చెందిన వారు. యుద్ధ నౌక కమాండింగ్ అధికారి కమాండర్ లీ ఆర్. టేట్, ఎగ్జిక్యూటివ్ అధికారి లెఫ్టినెంట్ కమాండర్ జెఫ్రీ ఈ.యార్క్‌లను దాడికి బాధ్యులుగా ఇరాన్ రాయబార కార్యాలయం గుర్తించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టిన మొదటి రోజే మినాబ్‌లోని 'షజరే తయ్యిబే' ప్రాథమిక పాఠశాలపై తోమహాక్ క్షిపణుల దాడి జరిగింది. ఈ దాడిలో 168 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పో యారు. పాఠశాలపై మూడుసార్లు తోమహాక్ క్షిపణులను ప్రయోగించాలని ఆ ఇద్దరు నేవీ అధికారులు ఆదేశిం చారని ఇరాన్ ఆరోపించింది. కాగా 357 రోజుల సుదీర్ఘ సైనిక మోహరింపు తర్వాత యూఎస్‌ఎస్ స్ప్రూయన్స్ యుద్ధ నౌక కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నౌకా స్థావరానికి చేరుకున్న రోజే ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా సైనికాధికారుల పేర్లను ఇరాన్ బహిర్గతం చేయడంపై వాషింగ్టన్‌లో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఉన్నతా ధికారులపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఇరాన్‌ను హెచ్చరించారు.







కామెంట్‌లు (0)