ముందు మీరే ప్రధానిగా ఉండండి : ఐసెన్కోట్కు నెతన్యాహూ ప్రతిపాదన
మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి : ఐసెన్‌కోట్
టెల్ అవీవ్ : ఇజ్రాయిల్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుం టున్నాయి. అక్టోబర్ 27న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆపద్ధర్మ ప్రధాని బెంజమిన్ నెత న్యాహూ, ప్రతిపక్ష నేత గాడీ ఐసెన్ కోట్ ముందుకు వచ్చారు. టెల్ అవీవ్‌లోని సైనిక ప్రధాన కార్యా లయం వద్ద వీరిద్దరి మధ్య ఆదివారం సుమారు రెండు గంటల పాటు ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత ఇరువురు నేతలు అధికారికంగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమేనని నెతన్యాహూ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం మొదట ఐసెన్‌కోట్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి, తాను ‘ప్రత్యామ్నాయ ప్రధాని’గా కొనసాగడానికి అంగీకరిస్తున్నానని ఆయన చెప్పారు. అంటే రొటేషన్ పద్ధతిలో అధికారాన్ని పంచుకునేందుకు నెతన్యాహూ సంసిద్ధత వ్యక్తం చేశారు.
నెతన్యాహూ ప్రతిపాదన విషయంలో ఆయన చిత్తశుద్ధిని పరీక్షించేందుకు లికుడ్ పార్టీకి 24 గంటల సమయం ఇస్తున్నానని ఐసెన్‌కోట్ తెలిపారు. నెతన్యాహూ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా ఐసెన్‌కోట్ కూటమిలోనినఫ్తాలీ బెన్నెట్ సూచిస్తుండగా మరో ఇద్దరు నేతలు యాయిర్ లాపిడ్, యాయిర్ గోలన్ దానిని వ్యతిరేకిస్తున్నారు. నెతన్యాహూ ప్రతిపాదనను రాజకీయ ఎత్తుగడగా వారు కొట్టిపారేశారు. నెతన్యాహూతో కలసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 120 స్థానాలున్న ఇజ్రాయిల్ పార్లమెంటులో నెతన్యాహూ కూటమికి 53, ఐసెన్‌కోట్ కూటమికి 48, అరబ్ పార్టీలకు 19 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఐసెన్‌కోట్ కూటమిలో భిన్నాభిప్రాయాలు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐసెన్కోట్ను దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ నవంబరులో ఆహ్వానించారు. డిసెంబర్ 6వ తేదీ లోపు ఆయన సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మరో 14 రోజుల గడువు ఇస్తారు. అయితే పొడిగింపు అవసరం లేకుండానే గడువు లోగానే మెజారిటీని నిరూపించుకుంటానని ఐసెన్‌కోట్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపారు. అరబ్ పార్టీ అయిన రామ్ ఆయనకు బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. హమాస్‌ను రామ్ పార్టీ నేత మన్సూస్ అబ్బాస్ ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు.
అవినీతి ఆరోపణలు నీరుకారతాయా ?
నెతన్యాహూపై ఉన్న అవినీతి ఆరోపణలను పునః సమీక్షించాలని, శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జెరుసలేం జిల్లా కోర్టు న్యాయ మూర్తులు ఇటీవల అటార్నీ జనరల్‌కు సూచించడం ఇజ్రా యిల్ రాజ కీయాల్లో సంచలనం రేపింది.







కామెంట్లు (0)