నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించిన యం రాజేష్ చంద్ర, ఐపీఎస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన యం రాజేష్ చంద్ర ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సింధు శర్మ ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.