యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్

– మూడు గ్రామాల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీల ఎన్నిక
నవతెలంగాణ- నెల్లికుదురు: మండలంలోని వావిలాల గ్రామ యూత్ కాంగ్రెస్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏర్పు కొండ మహేందర్, నర్సింహలగూడెం  యూత్ కాంగ్రెస్ర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి సుమన్ గ , రావిలాల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కత్తుల కుమార్ ల ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోగుల అశోక్ యాదవ్ తెలిపారు గురువారం ఎన్నిక కాబడిన వర్కింగ్ ప్రెసిడెంట్ లకు నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చురుకైన వ్యక్తిగా కొనసాగుతున్నందున ఈ పదవిని కట్టబెడుతున్నామని అన్నారు రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రాబోయే ఎన్నికల నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు మా నియమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో, మండల యూత్ ఉపాధ్యక్షుడు రేఖ అశోక్, అధికార ప్రతినిధి చల్లమల్ల నవీన్, యూత్ ప్రధాన కార్యదర్శి గుండెపాక యాకన్న, వనగండ్ల సుధాకర్, సందేపాక లక్ష్మినారాయణ, ప్రభాకర్, ఎండి యాకూబ్ పాష, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love