Sunday, June 28, 2026
E-PAPER
Homeక్రైమ్పిడుగుపాటుకు యువకుడు మృతి

పిడుగుపాటుకు యువకుడు మృతి

- Advertisement -

వర్షం నుంచి రక్షణ కోసం చెట్టు కిందకు వెళ్లగా విషాదం
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గాడ్రాల లో ఆదివారం పిడుగుపాటుకు యువకుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన జెడ్డి దావీదు తన తల్లిదండ్రులు జెడ్డి మంగరాజు, భద్రమ్మ తో పాటు కూలీలతో కలిసి తమ పొలంలో పత్తి విత్తనాలు నాటేందుకు ట్రాక్టర్‌ తో వెళ్లాడు.ఈ క్రమంలో సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభం కావడంతో సమీపంలోని ఓ చెట్టు కిందకు ఆశ్రయం పొందారు.

దావీదు ట్రాక్టర్‌ను ఆపి అదే చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. మెరుపులు తీవ్రంగా ఉండటంతో అక్కడ ఉన్న కూలీలు చెట్టు కింద నుంచి మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే దావీదు కూడా అక్కడి నుంచి వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

మంగరాజ – భద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, దావీదు చిన్న కుమారుడు. ఈ ఏడాదే అతనికి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.తమ కళ్ల ముందే రెప్పపాటులో కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు, కూలీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -