– ఆమని ఉగాది అవార్డ్స్ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న యూత్ ఐకాన్ వినయ్ కుమార్
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్ లో ఘనంగా నిర్వహించిన శ్రీ విశ్వావస్ నామ సంవత్సరం సంగీత నృత్య నీరాజనం కార్యక్రమంలో విశిష్ట అతిథిగా యూత్ ఐకాన్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. మహాలయ ఇన్స్టిట్యూట్ గుబ్బల సాయి మహాలయ, లావణ్య, చినుకు ఫౌండేషన్ , కోవిడ ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన ఆమని ఉగాది అవార్డ్స్ కార్యక్రమంలో వినయ్ కుమార్ మాట్లాడుతూ నృత్య కళలను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని వినయ్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వినయ్ కుమార్ ను సత్కరించారు.