డ్రగ్స్, బెట్టింగ్లకు పాల్పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలి

Youth should be vigilant against drugs and betting– ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ పిలుపు..
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితిల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుకుదేవుల 94వ వర్ధంతి కార్యక్రమంలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పేరబోయిన మహేందర్ వస్తువుల అభిలాష్లు మాట్లాడుతూ భగత్ సింగ్ తన చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమానికి ఆకర్షితులై స్వాతంత్ర్య పోరాటంలో యువకులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసిన గొప్ప నాయకుడని వారు తుపాకులను సైతం లెక్కచేయకుండా స్వాతంత్ర్యం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన దేశభక్తులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు అని అన్నారు. వారి యొక్క స్ఫూర్తితో నేటి యువత డ్రగ్స్ మరియు బెట్టింగ్లకు పాల్పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, నాయకులు దాసరి లక్ష్మయ్య, యువజన విద్యార్థి నాయకులు పల్లెపాటి వంశీ, పుల్లూరు సురేష్, తేజ, ముదిగొండ ఠాగూర్, అంకం నగేష్, అనంతుల నరసింహ, అర్జున్, ఎర్నోస్ పాల్, మనోహర్, సాయి కిరణ్, లక్ష్మణ్, అనంతుల నరసింహ, తోటకూర శేఖర్, కంబాల రాజు పాల్గొన్నారు.

Spread the love