– మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ క్రీడలను ప్రారంభించి, విజేతలకు బహుమతులు అందజేత
నవతెలంగాణ – తాడ్వాయి
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల వలన శరీర దారుఢ్యం తో పాటు ఆయురారోగ్యాలు ఉంటాయని, రాష్ట్ర కాంగ్రెస్ యువజన కార్యదర్శి దనసరి సూర్య అన్నారు. బుధవారం మండలంలోని మహాశివరాత్రి సందర్భంగా పంభాపూర్, లింగాల గ్రామాలలో ఏర్పాటుచేసిన వాలీబాల్ క్రీడోత్సవాలకు హాజరై క్రీడాకారులకు బనీన్లు, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ధనసరి సూర్య మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా యువతకు క్రీడలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయన్నారు. అనంతరం గెలిచినా యువకులకు బహుమతులు ప్రధానం చేశారు. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చుపటేల్, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ముక్తి రామస్వామి,లింగాల మాజీ ఎంపిటిసి ఊకె పోతురాజు, మాజీ సర్పంచులు ఇర్ప సునీల్, బెజ్జూరి శ్రీనువాస్, కల్తీ లలిత నారాయణ, ఊకె మౌనిక నాగేశ్వరరావు, పోలేబోయిన కృష్ణ, మంకిడి నరసింహ స్వామీ, ఎల్లబోయిన జానకి రాంబాబు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడి సతీష్, నాయకులు మారం సుమన్ రెడ్డి, ఊకె కృష్ణ, ఊకె నాగేష్, చెన్నూరు సతీష్, ముజఫర్ హుస్సేన్, చిరంజీవి, మర్రి నరేష్, పోలెబోయిన కుమార్, అరేం వెంకటేష్, చిరంజీవి, పల్నాటి సత్య, ముత్తినేని లక్ష్మయ్య గ్రామాల పెద్దలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.