
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అవినీతి అక్రమాలపై యువత పోరాటం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా మాజీ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్ లో ఆదివారం ఏఐవైఎఫ్ (అఖిల భారత యువజన సమైక్య)2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. యువత స్వయంకృషితో ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, దేశంలో పెరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక వాదాన్ని కాపాడి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. జిల్లా లో గంజాయి మహమ్మారిలా విస్తరిస్తుందని దానికి వ్యతిరేకంగా యువకుల్లో చైతన్యం తీసుకురావాలని, విదేశీ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు నీలా శ్రీనివాస్,అఖిల భారత యువజన సమైక్య పట్టణ అధ్యక్షుడు బూర సైదులు, కార్యదర్శి ఎడవెల్లి శ్రీకాంత్, కోశాధికారి తాళ్ల సైదులు, సురేష్, కామేష్, హరి, శ్రీకాంత్, నాగరాజు, శేఖర్, వాడపల్లి గోపి, తాళ్ల రవి, కూకుంట్ల సైదులు, తదితరులు పాల్గొన్నారు.