
నీటి సరఫరా పై మండల అధికారులతో, పంచాయతీ కార్యదర్శులతో మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్ ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో నీటిని సరఫరా చేయాలని సూచించారు. గ్రామాలలో అవసరమైతే బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందించాలని కోరారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు, ఇందిర ఇండ్లు, నర్సరీల నిర్వహణ, రాజీవ్ యువ వికాసం పథకంపై చర్చించినట్లు భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీఓ దినాకర్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.