నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గుజరాత్‌కు రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులను కేటాయిస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గం సమావేశ మైంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. 2026-27 సీజన్‌కు చెరకు రైతులకు క్వింటాల్‌కు రూ.365 చొప్పున ‘న్యాయమైన, లాభదాయకమైన ధర’ను మంత్రివర్గం ఆమోదించింది. కాటన్ మిషన్.. పత్తి ఉత్పాదకతను పెంచేందుకు ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కింద రూ. 5,659.22 కోట్లు మంజూరు చేసింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద మరో రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వీటిలో జిఎఎన్ (గాలియం నైట్రైడ్) టెక్నాలజీ ఆధారిత దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య మినీ/మైక్రో-ఎలఈడీ డిస్ప్లే కేంద్రం, ఒక సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కేంద్రం ఉన్నాయి. ఆమోదం పొందిన ఈ రెండు ప్రతిపాదనలతో గుజరాత్లో సుమారు రూ.3,936 కోట్ల మొత్తం పెట్టుబడితో సెమీకం డక్టర్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీటితో 2,230 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్.. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం ఈ సంస్థకు రూ. 3,068 కోట్లు కేటాయించింది. సుచి సెమికాన్ ప్రయివేట్ లిమిటెడ్.. మరో యూనిట్ కోసం రూ. 868 కోట్లు మంజూరు చేసింది.
రైల్వే నెట్‌వర్క్‌లో భాగంగా మూడు మార్గాల్లో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నగద – మథుర రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 16,403 కోట్లు, గుంతకల్ – వాడి లైన్ నిర్మాణానికి రూ. 4,758 కోట్లు కేటాయించింది. ఇది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. బుర్హవాల్ – సీతాపూర్ రైల్వేలైన్‌కు రూ.2,276 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లోని 19 జిల్లా లను కవర్ చేయనున్నాయి. ఈ లైన్లు సుమారు 901 కిలో మీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను పెంచనుంది. అంతేకాకుండా ఈ ప్రతిపాదిత మల్టి ట్రాకింగ్ ప్రాజెక్ట్ లు దాదాపు 83 లక్షల జనాభా కలిగిన 4,161 గ్రామాలకు అనుసంధాన పరచనుంది. అలాగే దేశంలోని మహాకాళేశ్వరం, రణతంబోర్ నేషనల్ పార్క్, కునో నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్, మధు, బఅందావన్, మంత్రాలయ(శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం), నెట్టికంటి ఆంజనేయస్వామి, దేవాలయం, శ్యామ్ రామ్, ఇతర అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచ నుంది. వీటితో పాటు ఆహార ధాన్యాలు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు(పీఓఎల్), ఇనుము, ఉక్కు, కంటైనర్లు, ఎరువులు, మొదలైన వస్తువుల రవాణాకు అదనపు రవాణాకు మార్గం సుగుమం కానుందని కేంద్రం వెల్లడించింది. రైల్వేలు పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్ట్‌లు అయినం దున వాతావరణ లక్ష్యాలను సాధించడంలో కీలకం కానుందని పేర్కొంది. ఎంఎసఎంఈలకు మద్దతునిచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) కోసం రూ. 18,100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
గుంతకల్-వాడి లైన్ నిర్మాణానికి రూ. 4,758 కోట్లు : కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాలు
- Advertisement -
- Advertisement -



