Wednesday, May 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగుజరాత్‌కు రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులు

గుజరాత్‌కు రెండు సెమీకండక్టర్ ప్రాజెక్టులు

- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోన్న బీజేపీ
ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ధ్వజం
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌, అసోంలో బీజేపీ భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేసి హత్య చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ తన ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు ఓటర్ల తొలగింపు వంటి ఎత్తుగడలను ఉపయోగిస్తోందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కూడా బీజేపీ అలాంటి ఎత్తుగడలనే ఉపయోగించి భారీ మెజార్టీ సాధించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేసి హత్య చేసిన తీరు పరిశీలిస్తే.. గత మూడూ నాలుగు నెలలుగా బెంగాల్‌పైనే బీజేపీ దష్టి పెట్టిందని తెలిపారు.

”బెంగాల్‌లో సర్‌ పేరుతో ఓటర్ల తొలగింపు వంటి ప్రక్రియ చేపట్టింది. బీహార్‌, మహారాష్ట్రలో కూడా ఇదే మాదిరి సర్‌ పేరుతో ఓటర్ల తొలగింపు జరిగింది. అక్కడ విజయాలను సాధించింది. ఢిల్లీలో నా సొంత నియోజక వర్గంలో కూడా ఇదే జరిగింది. నేను జైలుకి వెళ్లకముందు అక్కడ 1,48,000 ఓట్లు ఉంటే.. నేను జైలు నుంచి వచ్చిన తర్వాత 1,06,000 ఓట్లే ఉన్నాయి. కేవలం ఆరు నెలల్లో 42 వేల ఓట్లను తొలగించారు. గతసారి నేను 30వేల ఓట్ల తేడాతో గెలిచాను. 42వేల ఓట్లు తొలగిస్తే.. కేవలం 2025 ఎన్నికల్లో మూడు వేల ఓట్లతో ఓడిపోయాను. బీజేపీ ఇలా వ్యవహరిస్తుంటే ఎవరైనా ఎలా గెలవగలరు? ఓట్లన్నీ రద్దు చేస్తుంటే ఏమీ మిగలదు. ఇదే గందరగోళం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందుకే నేడు ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది” అని కేజ్రీవాల్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -