నవతెలంగాణ-మిరుదొడ్డి: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వజయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన మహనీయుల జయంతి సందర్భంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన ప్రముఖులకు “దళిత రత్న” అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట మిరుదొడ్డి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన జాతీయ మాల మహానాడు నిమ్మ నితిన్‌కు ఈ ప్రతిష్టాత్మక “దళిత రత్న” అవార్డు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మ నితిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డా, అద్దంకి దయాకర్, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, జిల్లా నాయకులు ఆరే కిషోర్ ల నాయకత్వంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో ముందుండి పనిచేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ అల్లిబిల్లి మహేందర్ కు,సాంఘిక సంక్షేమ అధికారులకు కృతజ్ఞ తలు తెలిపారు. మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా వాసి నిమ్మ నితిన్‌కు “దళిత రత్న” అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



