Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీతకార్మికుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

గీతకార్మికుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ -పరకాల : పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీతకార్మికుడు పెరుమాండ్ల రాజకుమార్ ఇటీవల తాటిచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజకుమార్ నివాసానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ధర్మారెడ్డి, బాధిత కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రాజకుమార్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించడంతో పాటు, సంక్షేమ పథకాల ద్వారా పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -