పారిశుద్ధ్య వారోత్సవాలు ముగింపు: ఎంపీడీవో

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య వాత్సవాలు గురువారం ముగింపు చేయడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి.సందీప్ కుమార్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుధ్య వారోత్సవాల సందర్భంగా మురికివాడలు,విధులలో శుభ్రం చేయడం జరిగిందని చెప్పారు.పారిశుద్య వారోత్సవాల ముగింపు సందర్భంగా గ్రామాల పరిశుద్ధ కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగిందని బి.సందీప్ కుమార్ తెలిపారు. ప్రత్యేక అధికారులు,ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Spread the love