చొప్పదండి అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం 

నవతెలంగాణ-గంగాధర
చొప్పదండి నియెాజక వర్గం అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మినారాయణ ఆరోపించారు. గంగాధర మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ముఖ్యఅతిథి బత్తుల లక్ష్మీనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గండిపడిన నారాయణపూర్ రిజర్వాయర్ చెరువు కట్ట మరమ్మత్తులో జాప్యం చేయడం వల్ల పంటలకు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు.
రైతుల సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే సుంకె విఫలం అయ్యారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలాడని, డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వకపోగా, గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరును పట్టించుకోవడంలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తామే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చూపుతుందని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి వైద రామానుజనం, బీజేపీ మండల అధ్యక్షుడు కోల అశోక్, మండల ప్రధాన కార్యదర్శులు పంజాల ప్రశాంత్, రేండ్ల. శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోతే  శ్రీహరి రెడ్డి, కిసాన్  మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సుద్దాల రవీందర్ రెడ్డి, జిల్లా చేనేత సెల్ కో కన్వీనర్ రాజేంద్రప్రసాద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు దేశెట్టి శ్రీనివాస్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బొమ్మకంటి రాజిరెడ్డి, మండల అధికార ప్రతినిధి సరువు శ్రీనివాస్, రాగల సురేష్, బీజేపీ మండలం కార్యదర్శి అంజి, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి దయ్యాల ప్రణయ్, సదాల భాస్కర్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రా ఇంచార్జీలు పాల్గొన్నారు.

Spread the love