
తాసిల్దార్ కార్యాలయం ముందు బాధితులతో ధర్నా ఇటీవల కురిసిన గాలి వాన బీభత్సానికి నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ డిమాండ్ చేశారు. గురువారం గాలి వానతో నష్టపోయిన ప్రజలందరికీ నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.ఈ ధర్నాకు సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి సాంబశివ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం గత మూడు రోజుల క్రితం వర్షం పడి గాలి వానతో నష్టపోయింది వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ గాలి వాన కు ప్రజలు సర్వస్వం కోల్పోయారని ఇండ్లపై గడ్డి,రేకులు విరిగి పడిపోయాయని ఆయన అన్నారు. వర్షం పడి ఇండ్లలో ఉన్న నిత్యవసర సరుకులు దుప్పట్లు బట్టలు కోల్పోయారని ఆయన తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి తక్షణ సహాయం అందించాల్సి ఉండగా అధికారులు నామమాత్రపు సర్వేలు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు ..నష్టపోయిన వారికి వెంటనే విపత్తు నివారణ కింద సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఒక్కొక్క ఇంటికి తక్షణ సహాయం కింద ₹20,000 ఇవ్వాలని అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో పక్కాయిలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ కోరారు.ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు .లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని ఆయన తెలిపారు .అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ సతీష్ కు అందజేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పొదిల్ల చిట్టిబాబు ,గొంది రాజేష్ .మండల కమిటీ సభ్యులు అంబాల మురళి ,గుండు రామస్వామి, పల్లపు రాజు, కొమ్ము రాజు ,మంచాల కవిత , శ్రీరామోజు సువర్ణ. అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.