
మండలంలోని తపాలాపూర్ జడ్పీ పాఠశాలలో ఎస్ఏ-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎంఈవో విజయకుమార్ అన్నారు. గురువారం ఆయన తపాలాపూర్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి ఉపాధ్యా యులకు సూచనలు చేశారు. 9వ తరగతి విద్యార్థులకు రాబోయే టెన్త్ సిలబస్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. హెచ్ఎం మురళీధర్ ఉపాధ్యాయుడి తుంగూరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.