
– శ్రీ రాజ తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సుందర్ నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని, శ్రీ రాజ్య తండా గ్రామ శివారు హేమ్ల తండాలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ సుందర్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఎన్ఆర్ఈజీఎస్ రూ 5 లక్షల నిధులతో బానోతు రామచంద్రు ఇంటి నుండి హనుమాన్ గుడి వద్దకు సిసి రోడ్డు పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాద్ ఎంపీ పోరిక బలం నాయక్ సహకారంతో సీసీ రోడ్డు నిధులను తీసుకొచ్చి గ్రామంలో ప్రతి వీధులలో బురదమయ్య లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎంపీ బలరాం నాయక్ సహకారంతో ఐదు లక్షలు ఎన్ఆర్ ఈజీఎస్ నిధులను తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, జాటోతు రమేష్ ,జాటోతు చంద్రు, బానోతు వీరన్న, ఆంబోతు భిక్షం, తదితరులు పాల్గొన్నారు.