సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి

– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం 43 వ వార్డులో, గాంధీనగర్‌లో మహిళా సంఘం, యువజన సంఘం, నవతెలంగాణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులు వేశారని, ప్రతి ముగ్గు ఆదర్శంగా నిలిచే విధంగా యువతకు ఆలోచింప విధంగా ఉందని చెప్పారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతన్నల దీనగాథలపై ముగ్గులు వేయడం వలన వారి సమస్యలు అందరూ అర్ధం చేసుకునేలా ఉన్నాయన్నారు. మహిళలు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని సూచించారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడే నాయకులను ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అనంతరం బహు మతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ డబ్బికార్‌ మల్లేష్‌, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు డాక్టర్‌ మల్లుగౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, ఆయూబ్‌, పరుశరాములు, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన, సీనియర్‌ నాయకురాలు గాదె పద్మ, పట్టణ కార్యదర్శి అరుణ, మాజీ కౌన్సిలర్‌ చెనగోని యాదగిరి, కరిమున్నిసా, దేవయ్య, క్రాంతి, కోడైరెక్క మల్లయ్య, యేసు, జూకంటి హరిబాబు, వెంకట్‌రెడ్డి, చారి, పులమ్మ, జగన్‌నాయక్‌, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.
కుల మతాలకతీతంగా ముగ్గులు ఉండాలి
కుల మతాలకు అతీతంగా ముగ్గులు వేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. పట్టణంలో 34 వ వార్డు గాంధీనగర్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు మంచి సందేశం ఇచ్చే విదంగా ముగ్గులు వేశారని జూలకంటి అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా రాజకీయ చైతన్యం కలిగి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, పార్టీ వన్‌ టౌన్‌ కమిటీ సభ్యులు యాదగిరి, కోడి రెక్క మల్లయ్య, వేములపల్లి వైస్‌ఎంపీపీ పాతూరి గోవర్ధన, మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణ, బంటు రామారావు, పార్టీ శాఖ కార్యదర్శి తక్కెళ్ళపల్లి ఏసుబాబు, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు దైద దేవయ్య, డీివైఎఫ్‌ఐ నాయకులు దైద శివకుమార్‌, రెమడాల క్రాంతి, రణధీవేకుమార్‌, బొంగరాల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love