Monday, June 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసుందర్‌ పిచాయ్‌ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్‌..

సుందర్‌ పిచాయ్‌ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :  ఇజ్రాయెల్‌తో గూగుల్ వ్యాపార ఒప్పందాలపై కొందరు స్టాన్‌ఫోర్డ్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రసంగాన్ని బహిష్కరించి, పాలస్తీనాకు మద్దతుగా వాకౌట్ చేశారు. యూనివర్సిటీ 135వ స్నాతకోత్సవంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తుండగా.. వందలాది మంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలతో బయటకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. “ఫ్రీ పాలస్తీనా” అంటూ చేతుల్లో పాలస్తీనా జెండాలతో విద్యార్థులు నినాదాలు చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నిర్వహించిన ఎంఎస్ 95 స్టాన్‌ఫోర్డ్ 135 స్నాతకోత్సవ కార్యక్రమంలో ..2026 బ్యాచ్ ను ఉద్దేశించి గూగుల్ సిఇఒ ప్రసంగించారు. అయితే ఇజ్రాయిల్ ప్రభుత్వంతో గూగుల్, అమెజాన్ కుదుర్చుకున్న 1.2 బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఎఐ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్ కి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. పిచాయ్ ప్రసంగిస్తుండగా.. బయటకు వెళ్లిపోయారు. `పాలస్తీనియన్ల హత్యలు, నిఘా ద్వారా ఎలా ధవనంతులు కావాలో చెప్పడానికి మాకు మరో టెక్ బిలియనీర్ అవసరం లేదు” అని విద్యార్థులు ప్రకటించారు.

“యుద్ధ లాభాలకు వ్యతిరేకంగా నిలబడండి. గూగుల్ సిఇఒకు ఇక్కడ స్వాగతం లభించదని చెప్పండి” అంటూ విద్యార్థులు పాలస్తీనా జెండాలు పట్టుకుని “ ఫ్రీ పాలస్తీనా” అంటూ నినాదాలు చేపట్టారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఇజ్రాయిల్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని `స్టాన్‌ఫోర్డ్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీన్’ (స్టాన్‌ఫోర్డ్ ఎస్ జె పి) ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొన్ని వారాల క్రితమే వాకౌట్ ను ప్రకటించింది. గూగుల్ కి, ఇజ్రాయిల్ తో ఉన్న సంబంధాలను వ్యతిరేకిస్తూ ఈ వాకౌట్ చేయనున్నట్లు వెల్లడించింది. విద్యార్థుల నిరసనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు పిచాయ్ నిరాకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -