నవతెలంగాణ – నాచారం: మల్లాపూర్‌లోని విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా టాపర్లను అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల టాపర్‌గా మనస్విని 600కు గాను 585 మార్కులు సాధించగా, సాహితీ 580 మార్కులు, కె.ఇమ్మాన్యూల్ 573 మార్కులు భావన 570 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. ఇతర విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాల విజయగాథలో భాగస్వాములయ్యారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిటి. బుచ్చిరెడ్డి టాపర్లకు శాలువాలు కప్పి, నగదు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ పెద్దిటి.మానస మానస, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



