గ్యాస్ సిలిండర్ ఆ యాప్ లో బుక్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్..!

నవతెలంగాణ – హైదరాబాద్: సామాన్యులకు గుడ్ న్యూస్.  గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్.. ఆ యాప్ ఏంటంటే..? ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడకం అనేది సర్వసాధారణ విషయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ కనెక్షన్‌లను సబ్సిడీపై అందించడంతో దేశంలో గ్యాస్ వినియోగం గణనీయంగా పెరిగింది. తాజాగా ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంత మేర క్యాష్ బ్యాక్ అందిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం. డిజిటల్ చెల్లింపు సదుపాయాన్ని అందించే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్‌లను బుక్ చేసుకుంటే వినియోగదారులు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి కస్టమర్‌లు ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా గ్యాస్ బుకింగ్‌ల కోసం చెల్లింపు చేయాలి. ప్రస్తుతం, ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 803గా ఉంది. అయితే మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఎల్‌పిజి సిలిండర్‌ను బుక్ చేసి ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే మీకు 10 శాతం (రూ. 80) క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ విధంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మీకు రూ.723 అవుతుంది.

Spread the love