100% ఇంటి పన్నులు వసూలు కావాలి : డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని ప్రతి గ్రామంలో 100% ఇంటి పన్నులు ఈ నెల 15వ తేదీ వరకు వసూలు కావాలని డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, కార్యదర్శులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామాలలో నీటిని వృధా చేయకుండా, పంచాయతీ బోర్లలో నీటిని పొదుపుగా వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఒ ప్రవీణ్ కుమార్, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
Spread the love