కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

నవతెలంగాణ – బెంగళూరు: కర్నాటకలోని హవేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనక నుంచి ఢీకొట్టది.  శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Spread the love