1జేసీబీ, 7 ట్రాక్టర్ల పట్టివేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా మొరం రవాణా చేస్తున్న జెసిబి, ట్రాక్టర్ల ను స్వాదీనం చేసుకుని తహసిల్దార్ కు అప్పజేయనున్నట్లు ఎస్సై ఎస్ మహేష్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం.. యెల్లరెడ్డి పల్లి గ్రామ శివారులో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నరనే విశ్వసనీయ సమాచారం తో పోలిస్ సిబ్బంది తో కలిసి దాడి చేయగా అక్కడ ఒక జెసిబి,7ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. పట్టుకున్న ట్రాక్టర్లను జెసిబి ని తహసిల్దార్ వెంకట్రావు కు చర్యల నిమిత్తం నివేదించామని ఎస్సై మహేష్ వివరించారు.పోలిస్ స్టేషన్ పరిధిలో ఇసుక, మొరం ఆక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.
Spread the love