– వన్డే సీరిస్‌లో అడుగుపెట్టిన ఆటగాళ్లు
న్యూఢిల్లీ: భారత జట్టులో చోటు దక్కటమే గగనమయ్యేది ఆనాడు. కానీ ఇపుడు సత్తా ఉంటే నిలబడటం లేకపోతే..కొత్త ఆటగాళ్లకు చోటు దక్కుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో యువ ఆటగాడు సాయి సుదర్శన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఎంట్రీ ఇవ్వగానే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. గత రెండేండ్లలో దాదాపు 21 మంది వన్డే ఫార్మాట్‌లోకి అడుగు పెట్టారు. ఈ మేరకు మాజీ క్రికెటర్, క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా స్పెషల్ ట్వీట్ పెట్టాడు. దీనివల్ల బీసీసీఐ చాలా సంతోషంగా ఉంటుందని, అయితే ఇది మంచి కాదనే ఉద్దేశంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2021 నుంచి మొత్తం 21 మంది భారత ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చారని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. దానికి ఆకాశ్ చోప్రా స్పందించాడు.