- Advertisement -
– గ్రంథాలయ అధికారి చారి అభిషేక్
నవతెలంగాణ-నెల్లికుదురు : మండల కేంద్రానికి చెందిన పులి వెంకటమ్మ మృతి చెందడంతో కుటుంబాన్ని ఆదివారం సందర్శించి 25 కేజీల బియ్యం నగదు వెయ్యి రూపాయలు అందించినట్లు గ్రంథాలయ అధికారి చారి అభిషేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో శాఖ గ్రంథాలయంలో గత 30 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి పులి వెంకన్న తల్లి పులి వెంకటమ్మ మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ధనవంతుడ సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు .
- Advertisement -


