బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి 

నవతెలంగాణ- దుబ్బాక 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని.. పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదింపజేయాలని బహుజన లెబరల్ ఫ్రంట్ చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు డిమాండ్ చేశారు.బుధవారం దుబ్బాకలో వారు మాట్లాడారు.బీసీ హక్కుల సాధన కోసం ఢిల్లీలో బత్తుల సిద్దేశ్వర పటేల్,జక్కని సంజయ్ నేత లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు.హక్కుల సాధన కోసం బీసీ లు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.వారి వెంట బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమకారులు వెంకటచారి,దివిటి చంద్రయ్య,సుమన్,రాజేందర్,సత్యనారాయణ, న్యాయవాదులు కాస్తి శ్రీనివాస్,ఉపేందర్,రాజశేఖర్,ముత్యాలు,రాజు,ప్రసాద్ పలువురున్నారు.
Spread the love