జూలై 4 నుండి 7 వరకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ మరియు సస్టైనబిలిటీ (GCPRS)పై అంతర్జాతీయ సదస్సు


– భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మద్దతు అందిస్తుండగా భారతదేశం, విదేశాల నుండి నిపుణులు పాల్గొననున్నారు
– ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ మరియు స్థిరత్వం చుట్టూ ఉన్న సమస్యలను GCPRS పరిష్కరిస్తుంది ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ 2033 నాటికి $6.9 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (AIPMA) మరియు కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ అసోసియేషన్ (CPMA)చే నిర్వహించబడనున్న గ్లోబల్ కాన్క్లేవ్ ఆన్ ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ మరియు సస్టైనబిలిటీ (GCPRS) సదస్సు జూలై 4 నుండి 7, 2024 వరకు జరగనుంది. 2033 నాటికి 6.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్న ప్లాస్టిక్ వినియోగం మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలను ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగనున్న ఈ కాన్‌క్లేవ్ పరిష్కరించనుంది. AIPMA గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ అరవింద్ మెహతా, GCPRS 2024 చైర్మన్ శ్రీ హితేన్ భేడా మరియు AIPMA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మనోజ్ ఆర్ . షా లు మెరుగైన సేకరణ, వేరు చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం మరియు రీసైక్లింగ్ పద్ధతులుపై దృష్టి సారించిన ఈవెంట్ యొక్క లక్ష్యం ను నొక్కి చెప్పారు. “ఈ కాన్క్లేవ్ రీసైక్లబిలిటీ కోసం మెకానికల్, కెమికల్ మరియు డిజైన్ ఆవిష్కరణలను అన్వేషిస్తుంది, వాల్యూ చైన్ అంతటా వనరుల సామర్థ్యాన్ని మరియు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది” అని వారు చెప్పారు. “ఈ ఈవెంట్ పరిశ్రమల నాయకులు, స్టార్ట్-అప్‌లు మరియు పర్యావరణ నిపుణులు తమ తాజా పురోగతులను ప్రదర్శించడానికి మరియు ప్లాస్టిక్ పరిశ్రమలో సుస్థిరతను సాధించడంపై పరిజ్ఙానం పంచుకోవడానికి వేదికగా ఉపయోగపడుతుంది. వ్యాపారాలు నెట్‌వర్క్ చేయడానికి, సహకారాన్ని ఏర్పరచుకోవడానికి మరియు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ధోరణుల గురించి పరిజ్ఞానం పొందేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది” అని శ్రీ అరవింద్ మెహతా అన్నారు.
ముఖ్యమైన లింక్‌లు (రిజిస్ట్రేషన్ మరియు పార్టిసిపేషన్):
GCPRS వెబ్: https://gcprs.org/
సందర్శకుల నమోదు కోసం: https://register.gcprs.org/Visitor/Visitor_Registration.aspx
ఎగ్జిబిటర్ రిజిస్ట్రేషన్ కోసం: https://register.gcprs.org/Visitor/Visitor_Registration.aspx –

Spread the love