నవతెలంగాణ ధర్మసాగర్
ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన గొడుగు చిన్న ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆ గ్రామాభివృద్ధి ప్రదాత వల్లపరెడ్డి రాంరెడ్డి హుటాహుటిన వారి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులను రామన్న యువసేన సభ్యులు పరామర్శించి 50 కిలోల బియ్యం సహాయంగా అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ మడికంటి రాజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, రామన్న యువసేన అధ్యక్షుడు గంటే కృష్ణ, రామన్న యువసేన సభ్యులు మజ్జిగ సంపత్, కొలను దిలీప్ తదితరులు పాల్గొన్నారు.