– జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇతర పార్టీల నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కనిపించడం లేదని కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తు బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని, కేంద్రంలోని ముంత్రులు, అధికారులు ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ది పనులను చూసి ప్రభుత్వ నికి కితాబు ఇస్తున్నారని ఇది ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనకు నిదర్శనమని జిల్లా యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు.సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురుకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఎంతో మంది పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆదుకుంటుందని, ముఖ్యమంత్రి సహాయనిధి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. డెంగ్యూ వంటి వ్యాధులు వస్తే అప్పో సొప్పో చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది వాటికి అయిన బిల్లులకు సిఎం రిలీఫ్ ఫండ్ రూపంలో క్యాంప్ ఆఫీస్ నుండి అందిస్తున్నామని దీనికి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక దృష్టికి నిదర్శనమన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందంటే ప్రధానంగా బిఆర్ఎస్ నాయకులు, ప్రజలే అని పేర్కొన్నారు.
కరోనా వల్ల గత మూడు ఏళ్ళు ప్రపంచమే అతలాకుతలం అయ్యిందని, కాని ముఖ్యమంత్రి చొరవతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారని తెలిపారు. ఇతర పార్టీల నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కనిపించడం లేదని కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తు బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలోని ముంత్రులు, అధికారులు ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు అభివృద్ది పనులను చూసి కితాబులు ఇస్తున్నారని ఇది ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనకు నిదర్శనమన్నారు. సిఎం రిలీఫ్ పండ్, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో పేద బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నారు.
డిచ్ పల్లి గ్రామానికి చెందిన భూమయ్య కు1 లక్ష రూపాయలు,సుద్ధులం గ్రామానికి చెందిన గంగవ్వకు 1 లక్ష,డిచ్ పల్లి గ్రామానికి చెందిన సునంద కు 60 వేలు, ముల్లంగి గ్రామానికి చెందిన మౌనిక కు 40 వేలు, గొల్లపల్లి గ్రామానికి చెందిన రాధా 11వేల500 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఘన్ పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ బాషా కు 25 వేలు,సుద్ధులం గ్రామానికి చెందిన ఆర్ లక్ష్మి కు 55 వేలు, డిచ్ పల్లి గ్రామానికి చెందిన సిహెచ్ నడిపి సాయిలుకు 24 వేలు, దుస్గం గ్రామానికి చెందిన టి అజయ్ కు 12 వేలు, కోరట్ పల్లి గ్రామానికి చెందిన టీ వరలక్ష్మి కు 41వేల500, మోంగియా నాయక్ తండ గ్రామానికి చెందిన ఎల్ రెడ్యా కు 46 వేలు, అమృతపుర్ గ్రామానికి చెందిన మస్రతా బేగం కు 13 వేలు, అత్తర్ కు 13 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల మొత్తం విలువ రూ. 4,లక్షల95 వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చింతా శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి,సినియర్ నాయకులు మోహమ్మద్ యూసఫ్, ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్ రెడ్డి, నవీన్, మండల ముఖ్య నాయకులు సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.