6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలి

– జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక
నవతెలంగాణ-తుంగతుర్తి:
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని తూర్పుగూడెం, బండరామారం గ్రామాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గారెంటీ ల కోసం ప్రతి ఒక్కరూ అభయ హస్తం పథకం కింద తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రేషన్ కార్డు లేవని ఎవరు ఆందోళన చెందవద్దని దరఖాస్తు చేసుకుంటే అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుజ్జ పూలమ్మ, ఉపసర్పంచ్ గుండగాని మహేందర్,ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, తాసిల్దార్ యాదగిరి రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ జగ్గు నాయక్ తో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love