64.2 కోట్ల మంది ఓటేయడం ప్రపంచ రికార్డు: సీఈసీ

నవతెలంగాణ – ఢిల్లీ: ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. ఏడు విడతలుగా పోలింగ్‌ విజయవంతంగా జరిగింది’’ అని రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

Spread the love