Sunday, May 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాలిసెట్ లో 82.94 శాతం ఉత్తీర్ణత

పాలిసెట్ లో 82.94 శాతం ఉత్తీర్ణత

- Advertisement -

బాలికలదే పై చేయి…86.38 శాతం పాస్
79.92 శాతం అర్హత సాధించిన బాలురు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ పాలిసెట్-2026 లో 82.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. శనివారం హైదరాబాద్ మాసబ్‌‌ట్యాంక్‌‌ లోని సాంకేతిక విద్యా భవన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్ కన్వీనర్ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 98,029 మంది పరీక్ష రాయగా 81,307 మంది, ఎంబైపీసీ విభాగంలో 79,652 మంది రాయగా 81.25 శాతం అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 52,201 మందికి గానూ 41,719 (79.92 శాతం), బాలికల్లో 45,828 మందికి గాను 39,588 (86.38 శాతం), ఎంబైపీసీ విభాగంలో బాలురు 40,554 మంది రాయగా 77.69 శాతం, బాలికల్లో 39,098 రాయగా 85.31 శాతం పాలిసెట్‌‌లో అర్హత సాధించారు. ఎస్సీలు 18,481 మంది, ఎస్టీలు 8,817 మంది పరీక్ష రాశారు. రెండు విభాగాల్లో వంద శాతం అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 15 మంది టాప్ ర్యాంకులు సాధించారు. వారిలో ఎనిమిది బాలురు ఉండగా, ఏడుగురు బాలికలున్నారు. ఎంబైపీసీ విభాగంలో టాప్ ర్యాంకులు సాధించిన 15 మందిలో నలుగురు బాలికలుండగా, 11 మంది బాలురున్నారు. ఎంపీసీ విభాగంలో ఓసీలు 9,771 మంది పరీక్ష రాయగా 8,185 మంది (83.77 శాతం), బీసీ-ఏలో 9,565కి గానూ 6,844మంది 71.56 శాతం, బీసీ -బీలో22,401కి గానూ 17,588 మంది 78.51 శాతం, బీసీ- సీలో 230కి గానూ 180 మంది 78.26 శాతం, బీసీ-డీలో 24,244కి గానూ 17,824 మంది 73.52 శాతం, బీసీ-ఈలో 4,520కి గానూ 3,378 మంది 74.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎంబైసీలోనూ సామాజిక వర్గాల వారీగా ఓసీ, బీసీ-ఎ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ వరస క్రమంలో నిలిచారు.

టాప్ ర్యాంకర్లు వీరే​
​నామల లోకేశ్ (వరంగల్)
బానోత్ హేమంత్ (సూర్యాపేట)
అల్వియా షిఫాలీ (మంచిర్యాల)
మహమ్మద్ మహబూబ్ అర్భాజ్ అలీ (ఖమ్మం)
కోట్ల అపూర్వ (మహబూబ్ నగర్)
అన్నం హరి కృష్ణ (సంగారెడ్డి)
జంగల అన్వేష్ అంగాడ్ (నల్లగొండ)
చిలకనంద వర్థన్ రెడ్డి (సూర్యాపేట)
కందూరి ఆదిత్య శౌరి (ఖమ్మం)
రుద్రోజ్ సజన్ (సిద్ధిపేట్)
దూరెడ్డి వన్మయ్ రెడ్డి (నాగర్ కర్నూల్)
షేక్ ఫర్మాన్ షా (మహబూబాబాద్)
కటకం ప్రణవి (జగిత్యాల)
కీలపర్తి దేవిప్రియ (మేడ్చల్ – మల్కాజిగిరి)
ఉలువాల వైష్ణవి (సూర్యాపేట)
జక్కు తుషారా (హైదరాబాద్).

ఎంబైపీసీ విభాగంలో
కోట్ల అపూర్వ (మహబూబ్ నగర్)
రుద్రోజు సజన్ (సిద్ధిపేట్)
ఖానల హేమంత్ రెడ్డి (సూర్యాపేట)
జక్కు తుషారా (హైదరాబాద్ )
షేక్ ఫర్మాన్ షా (మహబూబ్ నగర్ )
నామల లోకేశ్ (వరంగల్)
నంద వర్థన్ రెడ్డి (సూర్యాపేట)
మహమ్మద్ అర్భాజ్ అలీ (ఖమ్మం)
రోతు అజయ్ (హైదరాబాద్)
షేక్ జహీద్ (భద్రాద్రి కొత్త గూడెం)
కున్ సోత్ అనుదీప్ (మంచిర్యాల)
కటకం ప్రణవి (జగిత్యాల)
జంగాల అవినాష్ అంగాడ్ (నల్లగొండ)
అన్నం హరి కృష్ణ (సంగారెడ్డి )
గడ్డం తేజస్వినీ (హైదరాబాద్ ).






- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -