
తాడ్వాయి మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో 93 శాతం నమోదయింది. మండలంలో మొత్తం 5945 మంది చిన్నారులు ఉండగా ఒక్కరోజే 5555 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేసినట్లు వైద్యాధికారి నజ్మీరా తెలిపారు. మండలంలో మొత్తం 29 బూతులు ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసి చుక్కల మందు పూర్తి చేసినట్టు తెలిపారు. మిగతా శాతం రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో ఎచ్ ఈఓ నారాయణ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.