- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని కేజీబీవీ మరుగుదొడ్లు శుభ్రం చేయుటకు (స్కావెంజర్) గా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎంఈఓ ఝాన్సీ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. స్కావెంజర్ గా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుండి విద్యా అర్హతలు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులైన మరియు తగిన ధ్రువ పత్రములతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. దరఖాస్తుకు చివరి ఈనెల 17 సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు మండల కార్యాలయం నందు సమర్పించాలని ఆమె సూచించారు. ఇట్టి దరఖాస్తును మండలాధికారులు ఎమ్మార్వో ఎండిఓ ఎంఈఓ పరిశీలించి ఎంపిక చేయబడునని తెలిపారు.
- Advertisement -