Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

 మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు రూరల్ : జూన్ 26న నిర్వహించనున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆలేరు మండలం గొలనుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం ఆలేరు ఎస్సై వినయ్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని,మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని తెలిపారు. విద్యార్థులు “సే నో టు డ్రగ్స్ (Say No to Drugs)” అనే సందేశంతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని,ఇతరులను కూడా చైతన్యపరుస్తున్నామని  ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -