- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పల్సి గ్రామంలోని విద్యా భారతి పాఠశాలలో బుధవారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ పురంశెట్టి లింగయ్య మాట్లాడుతూ… ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్ గా పనిచేసి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి అనేక సేవ కార్యక్రమాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోతన్న, కరస్పాండెంట్ గంగా సింగ్, ఉపాధ్యాయులు కొట్టే ప్రవీణ్, రాజు, సాయినాథ్, భోజన్న, దేవకి, కవిత, సరోజన, రాణి, గంగామణి, సరస్వతి, నేహా, నందిని, శ్రీవిద్య, అంజలి, శృతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -