Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డెంగ్యూ నివారణకు ప్రత్యేక చర్యలు

డెంగ్యూ నివారణకు ప్రత్యేక చర్యలు

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి/ మాచారెడ్డి : డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా మాచారెడ్డి మండలం గజ్య నాయక్ తండా పరిధిలోని అక్కాపూర్ రోడ్డుకు సమీపంలోని బీసీ కాలనీలో అధికారులు, ప్రజాప్రతినిధులు మంగళవారం పర్యటించారు. ఇటీవల డెంగ్యూ బారినపడి కోలుకున్న రోగిని ఎంపీడీఓ గోపీబాబు, స్పెషల్ ఆఫీసర్, పీహెచ్‌సీ వైద్యులు, గజ్య నాయక్ తండా సర్పంచ్ రావుల వినోద, ఉపసర్పంచ్ బిక్షపతి, గ్రామ సిబ్బంది పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు పరిసరాలను పరిశీలించి, ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. డెంగ్యూ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కాలనీ పరిసరాల్లో గడ్డి నివారణ మందుతో పాటు దోమల నివారణకు సంబంధించిన మందులను పిచికారీ చేశారు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని వైద్యులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -