- Advertisement -
మండల పశు వైద్యాధికారి అశోక్ రెడ్డి
పాలకుర్తిలో ఉచిత పశు వైద్య శిబిరం
నవతెలంగాణ – పాలకుర్తి
పశువులకు, పాడి గేదెలకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నామని మండల పశు వైద్యాధికారి దేవిరెడ్డి అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం పాలకుర్తిలో గాలికుంటు నివారణకు ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి టీకాలు వేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల బారి నుండి పశువులను, పాడి గేదెలను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. ఉచిత పశు వైద్య శిబిరంలో 365 పశువులకు టీకాలు వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -