- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో OSDగా పనిచేస్తున్న ఎన్.సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మంత్రి ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి ఇంటికి వెళ్లడంతో గందరగోళం నెలకొంది. HYD పోలీసులు స్పందిస్తూ సుమంత్‌పై తీవ్ర ఆరోపణలున్నాయని, ఆయనతో మూడు రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని, అందుబాటులోకి వస్తే ఆరోపణలపై విచారణ చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -