Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

నూతన ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
రామారెడ్డి నూతన ఎస్ఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ ను గొల్లపల్లి బి ఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. గురువారం ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ…. శాంతి భద్రతల దృశ్య గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఆన్లైన్ , సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, గ్రామానికి అనుమానాస్పదంగా వ్యక్తులు తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల మల్లేష్, రాజయ్య, కే బీరయ్య, రెడ్డి, జీర్ల ఎల్లయ్య, మస్కట్ నారాయణ, జీర్ల మల్లయ్య, కట్ట లింగం, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -