- Advertisement -
- బిఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజక ఇంచార్జీ రామ్ కిషన్ రెడ్డి
- నవతెలంగాణ – సారంగాపూర్
- కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ బలం అని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రామ్ కిషన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవి శంకర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు.
- ప్రతి కార్యకర్త కష్టపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ
అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ,వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.జిల్లా నాయకులు మరుగొండ రాము, డాక్టర్ సుభాష్ రావు. జీవన్ రావు, మధుకర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, భోజన్న,లక్ష్మణ్, గంగాధర్, ప్రవీణ్, రాజన్న, దత్తురాం, గజేందర్, గంగన్న, సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వర్, సతీష్, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ ప్రహల్లధ్, బద్రి నారాయణ, సతీష్, గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -