- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోoగ్లీ మండల కేంద్రం నుండి మధన్ హిప్పర్గా గ్రామం వరకు ఉన్న ముళ్ళ పొదల వలన గత కొన్ని రోజులుగా రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దారి గుండా అక్కడక్కడ రోడ్డు మర్మత్తు పనులు కూడా చేపట్టకుండా గత ప్రభుత్వ నాయకులు వదిలేదడంతో ప్రయాణం మరీ కష్టతరమైంది. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దృష్టికి కాంగ్రెస్ నాయకులైన మదన్ హిప్పర్గా సీనియర్ నాయకులు ఉమాకాంత్ పటేల్, లక్ష్మణ్ బాచావార్ లు తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. తక్షణమే అనుమతి ఇచ్చి పనులు ప్రారంభించాలని ఆదేశించారని నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -