Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్
శనివారం రోజున సీఎం సహాయనిధి చెక్కులను బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అనుక్షణం పేదలకు అండగా ఉంటూ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి కూడా సీఎం సహాయ నిధి నుండి ఎల్లప్పుడు ప్రజలకు చెక్కులను అందజేస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి, టిపిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఒకటి రోజు 1500 పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ ల పైన సంతకం చేసిన ఏకైక వ్యక్తిగా మన ఎమ్మెల్యే ఉంటారని ఆయన అనుక్షణం పేదల గురించి ఆలోచిస్తాడని పేదల పక్షపాతి మన ఎమ్మెల్యే భూపతిరెడ్డి అని ఆయన కొనియాడారు. ఇద్దరి లబ్ధిదారులైన బుగ ప్రసాద్, కేసిరెడ్డి నందిని కి చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోశెట్టి మధుసూదన్ సాయి రెడ్డి, గంగారం, నరసయ్య ,గోపాల్ మంగ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -