- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కల్వకుర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2Kరన్ కార్యక్రమాన్ని సీఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి ప్రారంభించారు. మహబూబ్ నగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా మీదుగా తిరిగి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు ఈ పరుగు జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు, వాకర్స్ క్లబ్, మానవతా ఫౌండేషన్, మిత్ర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
- Advertisement -

 
                                    