- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు భారీ భద్రత పెంచినట్లు సమాచారం. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతా చర్యలు కూడా కఠినతరం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో Z-కేటగిరీ భద్రత కొనసాగుతుంది. 24 గంటలూ ఆయనకు రక్షణగా సుమారు 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటుంది.
- Advertisement -