Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంలెక్కాపత్రం లేదు

లెక్కాపత్రం లేదు

- Advertisement -

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తీరు ఇదీ.. రిజిస్టర్ సంస్థ కూడా కాదు
అయినా రాజకీయాల్ని శాసిస్తున్న వైనం
38 దేశాల్లో 2502 అనుబంధ సంస్థలు
భారత్‌‌లో పూర్తిగా మినహాయింపు
విదేశాల్లో మాత్రం అక్కడి చట్టాల ప్రకారం నమోదు

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. హిందూత్వం, సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువలు అంటూ నీతులు చెప్పే సంఘ్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విదేశాల్లోనే ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల్లో దాదాపు 80 శాతం ఆయా దేశాల చట్టాల ప్రకారం రిజిస్టరయ్యాయి. ఆర్థిక లెక్కలు, పన్ను వివరాలను కూడా బహిర్గతం చేస్తున్నాయి. అయితే భారత్‌లో మాత్రం ఆరఎస్‌ఎస్ ఇప్పటికీ నమోదు కాని సంస్థగానే కొనసాగుతోంది. ఇప్పుడిదే వివాదానికి దారి తీస్తోంది.ఇటీవల కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే.. ఆరఎసఎస్ భారత్‌లో రిజిస్టర్ అవ్వాలని కోరగా.. ‘నమోదు కాని సంస్థలు చాలా ఉన్నాయి’ అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అయితే విదేశాల్లో సంఘ్ అనుబంధ సంస్థలే ఎక్కువగా చట్టబద్ధంగా నమోదు కావడమనేది మోహన్ భగవత్ వాదనకు విరుద్ధంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్యారిస్‌లోని సెరీ`సైన్సెస్ పొ రూపొందించిన, ది కారావాన్ ప్రచురించిన ‘సీయింగ్ ది సంఘ్’ డేటా స సెట్ ప్రకారం.. ఆర్‌ఎస్ఎస్‌కు భారత్‌తో పాటు 38 దేశాల్లో 2502 అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిలో విదేశాల్లో ఉన్న సంస్థల్లో సుమారు 80 శాతం రిజిస్టర్ అయ్యాయి. భారత్‌లో మాత్రం అనేక సంస్థలు రిజిస్ట్రేషన్ లేకుండానే కార్యకలపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో 747 సంస్థలు ఉన్నాయి.

​విదేశాల్లో కఠిన నిబంధనలు
అమెరికాలో హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచఎస్‌ఎస్), విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (వీహెచ్‌పీఏ) వంటి సంస్థలు లాభాపేక్ష లేని సంస్థలుగా నమోదయ్యాయి. పన్ను వివరాలు, ఆర్థిక లెక్కలను ప్రభుత్వానికి సమర్పిస్తున్నాయి. బ్రిటన్‌లో కూడా సంఘఅనుబంధ సంస్థలు వార్షిక ఆర్థిక నివేదికలు, సంస్థ నిర్మాణ మార్పులను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తున్నాయి.
​ఆర్ఎస్ఎస్ ను స్వచ్ఛంద సంస్థగా

అభివర్ణించిన మోడీ
ఈ విషయంలో స్పందన కోరుతూ ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌కు ‘ది వైర’ రెండు ఈ‘మెయిళ్లు కూడా పంపింది. అయితే ఆయన నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇక గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోడీ.. ఆరఎసఎస్‌ను అభినందించారు. ‘వందేండ్ల సేవా చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)’ గా అభివర్ణించారు. 2010లో దేశవ్యాప్తంగా సుమారు 40వేల శాఖలు కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ కు.. 2014 ఏప్రిల్ నాటికి 29వేల ప్రాంతాల్లో 44 వేల శాఖలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలోని 55వేల ప్రాంతాల్లో 88 వేలకు పైగా శాఖలు నిర్వహిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. అయితే ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎదుర్కొనే ఆడిట్‌లు, విరాళాల రికార్డుల నిర్వహణ, నిధుల వినియోగంపై కఠిన నిబంధనలు వంటి పర్యవేక్షణకు ఆర్ఎస్ఎస్ లోబడటం లేదని ‘ది వైర’ విశ్లేషణ పేర్కొంది.

​విదేశాల్లోని సంఘ్ సంస్థల నుంచి ఆర్ఎస్ఎస్ కు నిధులు?
కాలిఫోర్నియాలోని శాంటా క్లారా విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ ప్రొఫెసర్ రోహిత్ చోప్రా అభిప్రాయం ప్రకారం.. సంఘ్ అనుబంధ సంస్థలు వ్యూహాత్మక కారణాలతోనే విదేశాల్లో రిజిస్ట్రేషన్ పొందుతున్నాయి. రిజిస్ట్రేషన్‌తో అమెరికాలోని పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు సమీకరించే అర్హత లభిస్తుందనీ, ఆ నిధుల్లో కొంత భాగం భారత్‌లోని సంఘ్ అనుబంధ సంస్థలకు చేరుతుందని ఆయన చెప్పారు. 2002లోని ‘ది క్యాంపెయిన్ టు స్టాప్ ఫండింగ్ హేట’ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలోని సంఘ్ అనుబంధ సంస్థలు 30 లక్షల డాలర్లకు పైగా నిధులను భారత్‌లోని సంఘ్ అనుబంధ సంస్థలకు పంపించాయి. అలాగే 2014లో ‘సౌత్ ఏషియన్ సిటిజన్ వెబ’ (ఎస్ ఎస్ డబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో 2001`2012 మధ్య అమెరికాలోని సంఘ్ అనుబంధ స్వచ్ఛంద సంస్థలు రూ.2800 కోట్లకు పైగా (సుమారు 30 మిలియన్ డాలర్లు) ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు పంపినట్టు ఆరోపించింది.

​ఢిల్లీలో ప్రధాన కార్యాలయానికి రూ.150 కోట్లు!
సంఘ్ అనుబంధ సంస్థల మధ్య తరచూ నిధుల బదిలీలు జరుగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయని సమాచారం. ది కారవాన్ కథనం ప్రకారం.. 2025లో ప్రారంభమైన రూ.150 కోట్ల విలువైన ఆర్ఎస్ఎస్ ఢిల్లీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలను ‘శ్రీ కేశవ్ స్మారక్ సమితి (ఎస్‌కేఎసఎస్)’ అనే ట్రస్ట్ ద్వారా సమీకరించారు. ఆరఎసఎస్‌కు నాగ్‌పూర్ మినహా దేశంలో స్వంత భవనాలు లేవనీ, ప్రజలు నిర్మించి వాటిని సంఘ్ వినియోగానికి అందజేస్తారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించటం గమనార్హం.

​విమర్శల వెల్లువ
ఆర్ఎస్ఎస్ భారత్‌లో నమోదు కాని సంస్థగా కొనసాగుతూ, కార్యకలాపాలు నిర్వహించటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యుల నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయని చెప్పాలంటే సభ్యుల జాబితా, ఆదాయ వనరులు, ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా ఇతర ఎన్జీవోలలాగానే నమోదై, జవాబుదారీతనంలో వ్యవహరించాలని పలువురు నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు.

​భారత్ లో విరుద్ధం
​భారత్‌లో మాత్రం ఆర్ఎస్ఎస్ నమోదు కాని సంస్థగా ఉండటంతో.. ఇతర స్వచ్ఛంద సంస్థలకు వర్తించే ఆడిట్, విరాళాల వివరాలు, దాతల సమాచారం, ఆదాయ`వ్యయ లెక్కల నిర్వహణ వంటి నిబంధనలు దీనికి వర్తించడం లేదనే విమర్శలు ఉన్నాయి. బజరంగ్‌దళ్ వంటి కొన్ని ప్రముఖ సంఘ్ అనుబంధ సంస్థలు కూడా రిజిస్టర్ కాకపోవడం గమనార్హం. ఇక భారత్‌లో రిజిస్టర్ కాకపోవడంపై సంఘ్, దాని అనుబంధ, అనుకూల సంస్థలు, సంఘాలు మాత్రం తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆరఎసఎస్.. సభ్యుల నుంచి ‘గురుదక్షిణ’ రూపంలో మాత్రమే నిధులు స్వీకరిస్తుందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. చట్టం ప్రకారం తప్పనిసరిగా నమోదు కావాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ‘గురుదక్షిణ’పై పన్ను విధించాలన్న ప్రయత్నాలను కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -