- Advertisement -
- ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డికి రైతుల వినతి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామ రైతులకు కోతకు వచ్చిన వరి కోయటానికి వాగు పొంగిపొర్లుతుందని చౌటుప్పల్ ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డికి మంగళవారం ఆ గ్రామ రైతులు రాగిరి కిష్టయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.పావురాల గడ్డ నడిగడ్డ రైతులు దాదాపుగా 200 ఎకరాల సాగులో వరి పండిస్తున్నారు.గండి చెరువు అలుగు పోస్తుందని, వాగు దాటలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే గండి చెరువు వాగు వద్ద రెండు వంతెనలు నిర్మించాలని కోరారు. దీంతో రైతులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్,శ్రీను,జంగయ్య,యాదగిరి,గిరి పవన్,లక్ష్మణ్,శివకుమార్,వెంకటేష్,రాము తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



